26న వారణాసిలో మోదీ నామినేషన్

SMTV Desk 2019-04-10 16:35:09  indian prime minister, narendra modi, bjp, new delhi, loksabha elections, varanasi constituency

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 26న వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్‌ వేయనున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి మోడీ ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు (వడోదర) గుజరాత్‌ నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. అయితే వడోదర నుంచి తప్పుకున్న మోడీ.. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో నరేంద్ర మోడీ ఘన విజయం సాధించారు. వడోదర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూద మిస్గ్రీ మీద భారీ మెజార్టీతో మోడీ గెలుపొందారు.