చట్టం మీ చుట్టం కాదు...ట్రంప్ కి ట్విట్టర్ షాక్

SMTV Desk 2019-04-10 16:33:10  America president, Donald trump, twitter

వాషింగ్టన్: చట్టం ఎవ్వరి చుట్టం కాదు అనే దానికి ఉదాహరణగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన షేర్ చేసిన ఓ వీడియోను కాపీ రైట్ ఉల్లంఘన అంటూ తీసి పడేసింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న ట్రంప్ కొన్నాళ్లుగా ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తన ప్రభుత్వ విజయాలంటూ కొన్ని విషయాలను ఏకరువు పెడుతున్నాడు. లెక్కలు, నిజాలు, సాక్ష్యపు వీడియోలు, నినాదాలు అంటూ హోరెత్తిస్తున్నాడు. తాజాగా రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్టాడు. ‘మొదట వాళ్లు నిన్ను పట్టించుకోరు, తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, జాతిపిచ్చోడివి అని అంటారు.. కానీ మీ ఓటు అదంతా తప్పు అని రుజువు చేస్తుంది..’ అని వీడియోపైన అక్షరాలు కనిపిస్తాయి. బ్యాట్‌మన్ సిరీస్‌లోని చిత్రం ద డార్క్ నైట్ రైజెస్ కోసం హాన్స్ జిమ్మర్ కూర్చిన సంగీతాన్ని దీనికి జోడించాడు. దీంతో ఇది కాపీరైట్ ఉల్లంఘన అంటూ ట్విటర్ తీసేసింది.