'గూగుల్‌ పే' పై ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు

SMTV Desk 2019-04-10 16:07:00  google pay, reserve bank of india, delhi high court, abhijith mishra

న్యూఢిల్లీ: నగదు లావాదేవీల యాప్ ‘గూగుల్‌ పే’ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గూగుల్‌ పే రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్రువీకరించలేదంటూ అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈయాప్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈయాప్‌ కేంద్ర బ్యాంకు నుండి సరైనా ధ్రువీకరణ లేదని మిశ్రా పిటిషన్‌లో తెలిపారు. అంతేకాక ఈ సంవత్సరం మార్చి 20న ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ జాబితాలో గూగుల్‌ పే పేరు లేదని ఆయన వెల్లడించారు. అయితే మిశ్రా పిటిషన్‌ పై దర్యాప్తు చేపిట్టిన న్యాయస్థానం అధికారిక ధ్రువీకరణ లేకుండానే గూగుల్‌ పే యాప్‌ కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని ఆర్‌బీఐని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐ, గూగుల్‌ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది.