నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్

SMTV Desk 2019-04-10 16:02:15  rahul gandhi, congress party, amethi, priyanka gandhi, sonia gandhi

అమేథీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గం తరపున తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. రాహుల్‌ నామినేషన్‌ సమయంలో ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్‌ వాద్రా ఉన్నారు. నామినేషన్‌కు ముందు రాహుల్‌, ప్రియాంక అమేథిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో రాబర్ట్‌ వాద్రాతో పాటు వారి పిల్లలు రేహన్‌, మిరాయా కూడా పాల్గొన్నారు.