అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్

SMTV Desk 2019-04-10 15:59:03  Amazon Fab Phones Fest Sale, Vivo Nex, Realme U1, Huawei Y9 (2019), Vivo Y83 Pro, Honor Play

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఏప్రిల్ 11 నుంచి 13 వరకు ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో హానర్, వివో, ఒప్పొ, యాపిల్ వంటి మొబైల్ హ్యాండ్‌సెట్స్‌పై డిస్కౌంట్ పొందొచ్చు. వన్‌ప్లస్ 6టీ, రియల్‌‌మి యూ1, హానర్ ప్లే, ఐఫోన్ ఎక్స్ వంటి ఫోన్లు తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. యూజర్లు అలాగే హెడ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ ఇప్పటికే వన్‌ప్లస్ 6టీ ఫోన్‌పై, ఇతర హానర్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లను రివీల్ చేసింది. అయితే మిగతా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ధర ఎంతైంది వెల్లడించలేదు. వివో వై83 ప్రో, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్లను ఇంతకు ముందులేనంత తక్కువ ధరకే అందిస్తామని అమెజాన్ పేర్కొంది. అలాగే వన్‌ప్లస్ 6టీపై ఫస్ట్ టైమ్ డిస్కౌంట్ ట్యాగ్ చూపిస్తోంది. ఈ ఫోన్‌ను రూ.33,499కు కొనుగోలు చేయవచ్చు. ఫోన్ అసలు ధర రూ.37,999తో పోలిస్తే రూ.4,500 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఇకపోతే ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్లపై డిస్కౌంట్ ధర అందుబాటులో ఉండనుంది. అమెజాన్ అలాగే వీటిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్లపై పేటీఎంలో రూ.12,000 క్యాష్‌బ్యాక్ ఉంది.హానర్ ప్లే ఫోన్‌ను రూ.13,999కు, హానర్ 8ఎక్స్‌ ఫోన్‌ను రూ.12,999కు, హానర్ 8సీ ఫోన్‌ను రూ.8,999కు, హానర్ 7సీ ఫోన్‌ను 8,499కు సొంతం చేసుకోవచ్చు. అలాగే రియల్‌మి యూ1, ఒప్పొ ఎఫ్9 ప్రో, వివో వీ15 ప్రో, ఒప్పొ ఎఫ్11 ప్రో ఫోన్లపై కూడా డిస్కౌంట్ ఉంది.