సీఎంను రాజీనామా చెయ్యమన్న కమల్ హాసన్

SMTV Desk 2017-08-16 14:07:39  palaniswamy, kamal hasan tweet, tamilnadu cm

తమిళనాడు, ఆగస్ట్16: ఎప్పటికప్పుడు ఆసక్తిని రేపుతున్న తమిళ రాజకీయాలు రోజుకో ఉత్కంటను నేలకొలుపుతున్నాయి. ఇటీవల యూపీలో చోటు చేసుకున్న విషాద ఘటనకు సీఎం రాజీనామాను ఉదాహారిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాజీనామా చెయ్యాలని ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. యూపీలో చిన్నారుల మరణానికి బాధ్యత వహిస్తూ సీఎం యోగి రాజీనామా చెయ్యాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను ఉదాహారిస్తూ తమిళనాడు సీఎం రాజీనామ చేయ్యలంటూ ట్వీట్ చేసారు కమల్ హాసన్. ప్రమాదాలు జరిగాయని, ప్రభుత్వంలో అవినీతి ఉందని ఓ రాష్ట్ర సీఎం రాజీనామా చెయ్యాల్సి వస్తే తమిళనాడులో అటువంటి దారుణాలు ఎన్ని జరిగిన సీఎం ఎందుకు రాజీనామా చెయ్యట్లేదు అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ట్వీట్లు చేసిన ప్రతీసారి, ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే, ఇప్పుడు మరోసారి అటువంటి ట్వీట్లతో ప్రకంపనలు రేపుతున్నారు కమల్. అంతే కాదు సీఏం పళనిస్వామి టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. కమల్ హాసన్ పళనిస్వామిని విమర్శించడం ఇది మొదటి సారి కాదు, ఇటీవల ఆయన ట్వీట్ లతో పళనిస్వామి సర్కార్ పై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే, అప్పుడు "రాజకీయాల్లోకి వచ్చే ముందు మీరు సమాజానికి ఏం చేసారో చెప్పాలి," అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు సీఎం పళని. కాని కమల్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తమిళనాడును బలోపేతం చేయటమే తన ధ్యేయం అన్న కమల్, "డీఎంకే, అన్నడీఎంకే రెండు పార్టీలు కేవలం మొద్దుబారి పోయిన పరికరాలే" అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్లతో తమిళనాడులో కమల్ రాజకీయ ప్రవేశం పై మరో సారి వార్తలు గుప్పుమంటున్నాయి.. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు కాకుండా మరొకరికి మద్దతు ప్రకటించాలన్న కమల్ ట్వీట్ లు ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎటు వైపు మర్లుతాయో అని రాజకీయ విశ్లేషకులు అభప్రాయపడుతున్నారు.