'ఆర్ ఆర్ ఆర్' లోకి మరో బాలీవుడ్ భామ

SMTV Desk 2019-04-10 10:32:38  shraddha kapoor, saaho, janhvi kapoor

హైదరాబాద్, ఏప్రిల్ 09: రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

రాజమౌళి మాత్రం శ్రద్ధా కపూర్ .. జాన్వీ కపూర్ లపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. సాహో లో శ్రద్ధా కపూర్ పోర్షన్ దాదాపు పూర్తయిందట. అందువలన ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం.

ఏ కారణం చేతనైనా శ్రద్ధా కపూర్ నో చెబితే, జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే నిర్ణయంతో రాజమౌళి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. అజయ్ దేవగణ్ కీలమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, 2020 జూలై 30న విడుదల చేయనున్నారు.