సైకిల్ గుర్తుకే మీ ఓటు....సమంత ట్వీట్ వైరల్

SMTV Desk 2019-04-09 18:31:20  akkineni samantha, tdp, anagani sathyayadav, repalle constituency

ప్రముఖ సినీ నటి, అక్కినేనివారి కోడలు సమంతా టిడిపి తరపున ప్రచారం మొదలు పెట్టింది. మామ నాగార్జున వైకాపా పార్టీలో చేరతారని, ఆ పార్టీకి మద్దతిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె హఠాత్తుగా కలకలం రేపారు. ఏపీలోని కృష్ణా జిల్లా రేపల్లె నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు అనగాని సత్యయాదవ్‌కు ఓటేసి గెలిపించాలని, అభివృద్ధికే ఓట్ చెయ్యండి అని అత్యధిక మెజారిటీతో సత్యయాదవ్‌కు గెలిపించాలని సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ఆమె ట్విటర్ వీడియో ద్వారా కోరారు. దీంతో సత్యప్రసాద్‌తో సమంతకు బంధుత్వమేమైనా ఉందాని అని కొందరికి అనుమానం వచ్చింది. దీనిపై సమంత వివరణ ఇచ్చారు. ‘ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్.. నేను వ్యక్తిగతంగా ఆయనకు మద్దతిస్తున్నాను. నేను హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి సత్యప్రసాద్, ఆయన సోదరి డాక్టర్ మంజుల నాకు తెలుసు. ఆయన మంచి వ్యక్తి కనుక మద్దతిస్తున్నాను.. ’ అని ట్వీట్ చేశారు.