లాలూకి సీబీఐ షాక్

SMTV Desk 2019-04-09 18:16:34  laloo prasad, bihar former chief minister, cbi, dana scam

న్యూఢిల్లీ: బీహార్‌ మాజీ సిఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మరోసారి సీబీఐ గట్టి షాక్‌ ఇచ్చింది. దాణా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముందా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ కేసులో లాలూకు బెయిల్‌ ఇవ్వొద్దంటూ సుప్రీం కోర్టును సిబిఐ కోరింది. లాలూ బెయిల్‌ పిటిషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంలో సిబిఐ అఫిడివిట్‌ దాఖలు చేసింది. ప్రసాద్‌ యాదవ్‌ వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఆసుపత్రిలో ఉంచి ప్రత్యేక వార్డును కేటాయించామని సిబిఐ తెలిపింది. ఈ వార్డుకు డబ్బులు కూడా చెల్లిస్తున్నామని,ఆసుపత్రిలో ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కానీ ఆయన ఆసుపత్రిలో కూర్చుని రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు కొందరు తెలిపినట్లు సిబిఐ పేర్కొంది. దీంతో ఆయనకు బెయిల్‌ ఇవ్వడానికి వీల్లేదు’ అని తమ అఫిడవిట్‌లో సిబిఐ పేర్కొంది.