భారత్‌కు విదేశాల నుండి భారీ నగదు

SMTV Desk 2019-04-09 18:14:01  india, other countrys, america, dollars

వాషింగ్టన్‌: భారత్‌కు విదేశాల నుండి అధికంగా నగదు వస్తుంది అని ప్రపంచబ్యాంకు నివేదిక తెలిపింది. గతేడాది భారత్‌కు దాదాపు 79 బిలియన్‌ డాలర్లు నగదు చేరినట్లు వెల్లడించింది. విదేశాల నుంచి భారత్‌కు నగదు పంపేవారు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో డాలర్ల రూపంలో అత్యధికంగా సొమ్ము జమ ఐన దేశాలలో భారత్‌ మొదటగా నిలిచింది. భారత్‌ తర్వాత చైనా(67 బిలియన్‌ డాలర్లు), మెక్సికో( 36 బిలియన్‌ డాలర్లు), ఫిలిప్పీన్స్‌( 34 బిలియన్‌ డాలర్లు) దేశాలున్నాయి. గత మూడేళ్లనుంచి భారత్‌కు వచ్చి చేరే డాలర్ల సొమ్ము పెరుగుతుంది. 2016లో 62.7, 2017లో 65.3, 2018లో ఏకంగా 79 బిలియన్‌ డాలర్లకు చేరింది. విదేశాలనుంచి నగదు పంపేవారి సంఖ్య 14శాతం పెరిగింది. కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేక మంది పెద్ద మొత్తంలో సొమ్మును భారత్‌కుపంపారని ప్రపంచ బ్యాంకు తెలియజేసింది.