బెంగళూరు అతలాకుతలం..

SMTV Desk 2017-08-16 13:26:24  BANGLORE, RAIN FALL, TRAFFIC JAM,

బెంగుళూరు, ఆగస్ట్ 16 : రెండు రోజులుగా ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు అతలాకుతలమైంది. అపార్టుమెంట్లన్ని నీట మునిగాయి. వందలాది వాహనాలు రోడ్లపై కదలక మొరాయించడంతో ట్రాఫిక్ గంటల కొద్దీ స్తంభించింది. రెండు రోజులుగా పడుతున్న వర్షం కారణంగా చుట్టూ ఎక్కడ చూసిన నీరే కనిపించడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో రాష్ట్ర డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ సిబ్బంది రంగంలోకి దిగారని అధికారులు తెలిపారు. వరద బాధితులకు ఆహారం, మంచినీటిని అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. కోరమంగళ ప్రాంతంలోని ఎస్టీ బెడ్ ఏరియాలో వరదల్లో చిక్కుకున్న వారిని 40 రెస్క్యూ బోట్లతో బయటకు తెస్తున్నామని తెలిపారు. జయనగర్, బెన్నార్ ఘట్ట రోడ్డు, రాజరాజేశ్వరీ నగర్, జేపీ నగర్, నాగభైరవి, ఉత్తర హళ్ళి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో వరద ప్రభావం అధికంగా ఉందని సూచించారు. కాగా ఈ వర్షపాతం14 సెంటీమీటర్లు నమోదు కాగా, బైలికహళ్లి ప్రాంతంలో మాత్రం అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.