బండి సంజయ్‌ కుమార్‌కు అస్వస్థత

SMTV Desk 2019-04-09 17:13:55  bandi sanjay kumar, bjp, karimnagar, loksabha elections

కరీంనగర్‌: ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ లోక్‌సభ బిజెపి అభ్యర్ధి బండి సంజయ్‌ కుమార్‌ అస్వస్థతకు గురయ్యారు. నేడు కరీంనగర్ లో విజయ సంకల్పయాత్ర పేరుతో కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రచారం చేస్తుండగానే ఆయన ఉన్నట్టుండి ప్రచార వాహనంలోనే కుప్పకూలిపడిపోయారు. అప్రమత్తమైన కార్యకర్తలు, నేతలు ఆయనను అంబులెన్స్‌లో సమీపంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి తరలించారు. ఎండల తీవ్రతతో సంజయ్‌ అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయినట్లు వైద్యులు తెలిపారు.