భారత మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

SMTV Desk 2019-04-09 15:52:01  srilanka, srilanka navy arrests indian fishermans, tamilnadu

కొలంబో: శ్రీలంక నావికా దళం తమిళనాడుకు చెందిన నలుగురు మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. కంకేసంటరై సముద్రజలాల్లో చేపలను పడుతుండగా.. తెల్లవారుజామున వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక బోటును స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురు జాలర్లు పుదుకొట్టారు జిల్లాకు చెందినవారని మత్స్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.