కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యండి... టిడిపి ఎంపి జేసీ

SMTV Desk 2019-04-09 15:50:00  jc divakar reddy, tdp, mp, congress party, elections

అనంతపురం: టిడిపి ఎంపి జేసీ దివాకర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపురంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ...వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాక ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తనకు ఆ పార్టీపై మమకారం ఇంకా చావలేదన్నారు. అందుకే తాను ఇలా మాట్లాడుతున్నానని తన మనసులోని మాటను చెప్పారు. హిందీ రాకపోవడం వల్ల ఎంపీగా ఫెయిల్‌ అయ్యానని అంగీకరించారు.