బ్యాంక్ మోసాలకు ఐసీఐసీఐ బ్యాంక్ చెక్

SMTV Desk 2019-04-09 15:40:30  icici bank, banking frauds, private banks

రోజురోజుకి బ్యాంకింగ్ మోసాలు అధికమవుతున్నాయి. ఈ మోసగాళ్ళ భారిన అనేక మంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగ దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు తెలియజేసింది. వీటిని ఆ బ్యాంక్ కస్టమర్లు మాత్రమే కాదు.. ఎవరైనా ఫాలో కావ్వొచ్చు.

✺ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి యూపీఐ లేదా ఇతర పేమెంట్ వాలెట్స్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అథంటికేటెడ్ యూపీఐ యాప్స్‌ను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.
✺ ఎవరైనా సిఫార్సు చేసిన ట్రాన్సాక్షన్ యాప్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దు. కొంతమంది యాప్ డౌన్‌లోడ్ లింక్ పంపొచ్చు. వీటిపై క్లిక్ చేస్తే అసలుకే మోసం వస్తుంది.
✺ యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు రివ్యూలు చదవండి. తర్వాతనే సంబంధిత యూపీఐ, పేమెంట్ వాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
✺ మొబైల్ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసేటప్పుడు, చూసుకున్న తర్వాత ఆ యాప్ ఏమైనా అనుమతులు కోరితే.. వాటికి అనుమతినిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
✺ మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకుంటే వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించండి. అలాగే ఫోన్‌లో మీరు లాగిన్ అయిన అకౌంట్ల నుంచి వెబ్‌లో లాగ్ ఔట్ అవ్వండి.
✺ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ లేదా మొబైల్ నెంబర్‌కు వచ్చే బ్యాంకింగ్ అలర్టులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంక్‌కు రిపోర్ట్ చేయండి.
✺ మీకు తెలిసిన వ్యక్తికే డబ్బులు పంపించండి. తెలియని వారితో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరికి డబ్బులు పంపిస్తున్నారో మీకు తెలియకపోతే, ఆ లావాదేవీని నిలిపివేయండి. ✺ యూపీఐ వాలెట్ పిన్, పాస్‌వర్డ్, ఓటీపీ, ఎం-పిన్ వంటి వాటిని ఎవరికీ చెప్పొద్దు. ఆఖరికి బ్యాంక్ ఉద్యోగినని చెప్పినా కూడా తెలియజేయవద్దు.
✺ డిజిటల్ పేమెంట్ కోసం ఎస్ఎంఎస్, ఈ-మెయిల్‌కు వచ్చే తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఎల్లప్పుడూ నమ్మకమైన వెబ్‌సైట్‌నే ఉపయోగించండి.
✺ మీ కార్డు పిన్, ఓటీపీ, సీవీవీ, ఎక్స్‌పైరీ డేట్, గ్రిడ్ వ్యాల్యూ, కార్డు టైప్ వంటి వివరాలను ఎవరితో పంచుకోవద్దు. బ్యాంక్ ఉద్యోగినని చెప్పినా చెప్పొద్దు.
✺ క్రమం తప్పకుండా మీ పాస్‌వర్డ్‌ను మార్చుకుంటూ ఉండండి. పాస్‌వర్డ్‌లో ప్రత్యేకమైన గుర్తులు ఉండేలా చూసుకోండి. అప్పుడు ఇతరులు మీ పాస్ట్‌వర్డ్‌ను ఊహించలేరు.