ట్విట్టర్ లో పేలిన కేటీఆర్

SMTV Desk 2017-06-02 16:31:52  ktr, rahulgandhi, twitter, fire on cngress

హైదరాబాద్, జూన్ 2 : అఖిల భారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శలపై పురపరిపాలన, ఐటి శాఖామాత్యులు కేటిఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ట్విట్టర్ ద్వారా విమర్శనాస్ర్తాలను సంధించారు. కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రెస్ గా అభివర్ణించారు. ప్రజాస్వామ్యం పై ఎలాంటి నమ్మకం లేని పార్టీ గా...స్కాంలతో దేశాన్ని నిండా ముంచేసిందని...అత్యవసర పరిస్థితితో దేశాన్ని అతలాకుతలం చేసిన ఘనత ఆపార్టీదేనని వివరించారు. ఇక కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడడం ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ జోక్ అవుతుందని..అది ఓ జోక్ కు ఉండాల్సిన సాంప్రదాయాన్ని గుర్తుచేస్తుందని చెప్పారు. విశ్వసనీయత లేని కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన ఉపన్యాసాలను రాహుల్ గాంధీ చదువుతుండడం ద్వారా ఆ ప్రసంగాలు ఆ పార్టీని సిల్లీగా మార్చేస్తున్నాయని..రాహుల్ ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించాలని కోరారు. జాతీయ కాంగ్రెస్ నేతలుగా చెప్పుకునే కొందరు మాటలు గొప్పగా చేబుతారు..కానీ సొంత సామర్థ్యంతో కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలువలేరని ట్విట్టర్ లో పేర్కొన్నారు.