ఏటీఎంలల్లో దొంగ నోట్ల హళ్ చల్!!!

SMTV Desk 2019-04-09 15:30:29  atm machines, fake indian currency, fake two thousand notes, laknow

లక్నో: దొంగ నోట్ల బెడద ఏటీఎంలను కూడా ఒదలడం లేదు. వీటిలో కూడా నకిలీ నోట్లు హళ్ చల్ చేస్తున్నాయి. లక్నోలో ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన ఐదు ఏటీఎంలో దాదాపు రూ.4.26 లక్షల విలువైన దొంగ నోట్లు వచ్చాయి. ఇవ్వన్నీ రూ.2,000 నోట్లు కావడం గమనార్హం. ఈ ఏటీఎంలలో డబ్బులు తీసుకున్న కస్టమర్లు సంబంధిత బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. తర్వాత బ్యాంక్ ఈ విషయమై అడిట్ చేయమని కంపెనీని కోరింది. ఈ ఆడిట్‌లో దాదాపు 213 దొంగ నోట్లు వచ్చినట్లు తేలింది. ఈ ఒక్క సంఘటనే కాదు.. గత కొన్ని నెలల్లో ఇలాంటి ఘటనలు పలు చోట్ల జరిగాయి. చాలా మంది ఏటీఎంలలో దొంగ నోట్లు ఎందుకు వస్తాయి? అన్ని మంచి నోట్లే ఉంటాయని భావిస్తుంటారు. అయితే దొంగ నోట్లు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏటీఎంలలో దొంగ నోట్లు రావడం చాలా అరుదు. అయినా కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అలాగే నోటు వెనుక భాగంలో కుడి వైపు 2,000 అంకె ఉంటుంది. ఈ ఫీచర్లన్నీ మీరు ఏటీఎం నుంచి తీసుకున్న నోటుపై ఉంటే అది మంచి నోటు. అదే మీరు తీసుకున్న నోటులో కొన్ని ఫీచర్లు కనిపించలేదంటే అది దొంగ నోటే. వెంటనే బ్యాంకును సంప్రదించండి. దొంగ నోటు మార్చుకోవడానికి ఎఫ్ఐఆర్ అవసరం కావొచ్చు.