పవన్ కల్యాణ్ కు ఆలీ కౌంటర్

SMTV Desk 2019-04-09 15:27:41  pawan kalyan, ali, ysrcp, janasena chief

అమరావతి, ఏప్రిల్ 09: తనపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, తెలుగు సినీ నటుడు అలీ స్పందించారు. పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని ప్రశ్నలు సంధించారు.

"ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్. అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైనా సినిమాలు చెప్పారా? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? సర్.." అని ఆలీ అన్నారు.

"మీరు ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి నేను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను సర్. నేను ఎవ్వరి దగ్గరా అయ్యా! నేను కష్టాల్లో ఉన్నాను. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదు" అని ఆలీ అన్నారు.

అల్లా దయవల్ల చాలా బాగున్నానని, ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలీ ఉండడని. వెళ్లను కూడా అని ఆయన అన్నారు. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లనని అన్నారు. మీరు రాజమండ్రిలో విమర్శ చేయటం సరికాదు" ఆలీ అన్నారు. వైసిపిలో చేరితే తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని అన్నారు.

"నాకు స్వేచ్ఛ లేదా? మీ గురించి నేను వ్యాఖ్యానిస్తే మీరు నా గురించి కామెంట్ చేయాలి. రాజమండ్రిలో మీరు కామెంట్ చేయటం సరికాదు" అన్నారు. తన చుట్టానికి టిక్కెట్ ఇచ్చానని పవన్ అంటున్నారని గుర్తు చేస్తూ " నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? పోనీ ఇచ్చే ముందు నన్ను అడిగారా, అదెలా చెబుతారు సర్" అన్నారు.

"నా నెంబర్ మీ దగ్గర ఉంది. 12-14 ఏళ్లు నుంచి ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను. పార్టీలోకి రమ్మని పవన్ ఎప్పుడైనా అడిగారా? అడగరు, అప్పుడు ఇంత పెద్ద కామెంట్ చేయటం ఎందుకు" అని ఆలీ అన్నారు.