జనసేనకు భారీ విరాళం ఇచ్చిన హీరో నితిన్

SMTV Desk 2019-04-09 15:19:04  janasena, pawan kalyan, nithiin, 25 lakhs

జనసేన పార్టీకి సినీ హీరో నితిన్ భారీ విరాళాన్ని ఇచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు నితిన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. తన అభిమానాన్ని నితిన్ అనేక సార్లు స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేనకు తన వంతు సాయంగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.

నిన్న రాత్రి భీమవరంలో పవన్ కల్యాణ్ ను నితిన్, అతని తండ్రి, సినీ నిర్మాత సుధాకర్ రెడ్డి కలిశారు. డీహైడ్రేషన్ తో బాధపడుతున్న పవన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా రూ. 25 లక్షల చెక్ ను అందించారు. తనపై ఎంతో అభిమానం చూపిన నితిన్, సుధాకర్ రెడ్డిలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.