అందుకే జగన్ మోదీతో జత కట్టారు: నటుడు నారా రోహిత్

SMTV Desk 2019-04-09 15:17:58  tdp road show, nara rohit statement,

అమరావతి, ఏప్రిల్ 09: ఎవరైనా నీళ్లు లేని బావిలో దూకాలని భావిస్తేనే వారు వైసీపీకి ఓటు వేస్తారని నటుడు నారా రోహిత్ అన్నారు. నిన్న రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్‌ షో నిర్వహించిన ఆయన, సీఎంగా చంద్రబాబునాయుడు కొనసాగితే మాత్రమే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని అన్నారు. ముగ్గురు దుష్ట శక్తులు ఏకమయ్యాయని, వారంతా కలిసినా, చంద్రబాబును ఏమీ చేయలేరన్న సంగతి మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుందని అన్నారు.

ఏపీ విడిపోయాక ఓ వైపు రాజధాని నిర్మాణాన్ని, మరోవైపు ప్రజా సంక్షేమాన్ని నిరవధికంగా అందిస్తున్న చంద్రబాబుకు ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అయితే, సంవత్సరం వ్యవధిలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని రోహిత్ వ్యాఖ్యానించారు. జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే నరేంద్ర మోదీతో జత కట్టాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.