ఏపీ ఓటర్లు ఓటు వేస్తారా...???

SMTV Desk 2019-04-09 13:30:47  andhrapradesh elections, telangana, tsrtc, ysrcp

హైదరాబాద్: ఏపీలో జరిగే ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీ ప్రజలు అక్కడికి సరైన సమయంలో గమ్యం చేరుకుంటారా అనే దానిపై ఏపీ ఓటర్లలో ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులు సజావుగా చేరతాయా? సొంత ఊర్లకు సకాలంలో వెళ్లి ఓట్లు వేయాలని ఆశపడుతున్న ఆంధ్రా ఓటర్ల కళ నెరవేరుతుందా? అంటే అనుమానమేనని పలువురు ఏపీ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి వెళ్లే బస్సులను ఏదో ఒక సాకుతో ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇలా వలస ఓటర్లవల్లే వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు తరచూ ప్రస్తావిస్తుంటారు. అందుకే ఈసారి ఏపీ ఓటర్లు సొంతూర్లకు వెళ్లకుండ అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయనే ఆరో్పణలు ఉన్నాయి.