పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు?

SMTV Desk 2017-08-16 12:20:16  Pawan kalyan, Governor host dinner, Rajbhavan, Janasena, Governor

హైదరాబాద్, ఆగస్ట్ 16: మంగళవారం రాత్రి గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందుకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, ఇతర రాజకీయ ప్రముఖలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విచ్చేశారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ గవర్నర్‌తో కొద్ది సమయం ముచ్చటించారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ లో కూడా పోటీ చేయనున్నామని ఆయన గవర్నర్‌తో తెలిపారు. జనసేన పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పక్కా ప్రణాళికతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనాల మద్ధతు కూడగట్టుకున్న జనసేన ఇక తెలంగాణలో ప్రజల మన్నన కోసం వ్యూహాలు రూపొందిస్తుంది. ఇలాంటి సందర్భంలో పవన్ తెలంగాణలో కూడా పోటీ చేస్తానని పేర్కొన్నారు.