వాళ్లకు అమ్మ, చెల్లి లేరా?

SMTV Desk 2019-04-09 13:23:31  ysrcp, ys vijayamma, ys jagan mohan reddy, chandrababu, tdp, lakshmiparvati

కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షో వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మాట్లాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలా?చంద్రబాబునాయుడు, ఆయనకు వంతపాడే పత్రికలు లక్ష్మీపార్వతి గురించి తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉచ్చంనీచం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయమా? ధర్మమా? అని ప్రశ్నించారు. ‘వాళ్లకు అమ్మ, చెల్లి లేరా? ఆడవాళ్లను గౌరవించని ముఖ్యమంత్రి అవసరమా?’ అని ప్రశ్నించారు.