నారాయణగూడలో రూ. 8 కోట్లు స్వాధీనం...!!!

SMTV Desk 2019-04-09 13:19:06  loksabha elections, money transfer, illegal cash, kookatpally, congress party, narayanaguda, bjp, lakshaman

హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా రోజురోజుకి డబ్బులు విపరీతంగా బయటకి వస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు గట్టి నిఘా పెడుతుండడంతో డబ్బుల మూటలు గమ్యాలు చేరలేకపోతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో 8 కోట్ల నగదు పట్టిబడింది. కొందరు యువకులు ఇండియన్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని వెళుతుండగా టాస్క్‌ఫోర్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆదేశాలతో తాము డబ్బును డ్రా చేసి, తీసుకెళ్తున్నామని పార్టీ కార్యాలయ నిర్వాహకుడు నందిరాజు గోపి పోలీసులు చెప్పాడు. ‘లక్ష్మణ్ గారు 8 కోట్ల చెక్కు ఇచ్చారు. మేం తీసుకుని వస్తున్నాం. ఈ డబ్బుతో మాకేం సంబంధం లేదు. లక్ష్మణ్ చెప్పినట్లే చేశాం’ అని ఇతర నిందుతులు చెప్పారు. ఇంత భారీ సొమ్మును ఎన్నికల కోసమే ఖర్చు చేసేందుకు డ్రా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర నిందితులను ప్రదీప్ రెడ్డి, శంకర్, సుకుమార్ రెడ్డి, నందిరాజు గోపి, చలపతి రాజు, ఇందుశేఖర్, బ్రహ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.