75 వాగ్ధానాలను 2022లోగానే పూర్తి!!!

SMTV Desk 2019-04-09 13:18:12  bjp, loksabha elections, election manifesto, narendra modi

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీ బిజెపి మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పార్టీ అధ్యక్షుడు, ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ...తమ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని, జనం మనసుల్లో ఉన్న మాటలకు రూపమే తమ సంకల్ప పత్రమని అన్నారు. భారీ మేథోమథనం తర్వాత మేనిఫెస్టోను రూపొందించామన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది స్పూర్తిగా నిలుస్తుందన్నారు. జాతీయవాదం, అంత్యోదయ, సుపరిపాలన్న అన్న మూడు లక్ష్యాలను ప్రధానంగా ఎంచుకున్నట్లు మోదీ చెప్పారు. సాధారణంగా అయిదేళ్లకు లక్ష్యాలను నిర్ధేశిస్తారని, కానీ తాము 75 వాగ్ధానాలను 2022లోగానే పూర్తి చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. కొత్తగా జలవనరుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామన్నారు. జాలర్లకు కూడా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒకరికి నల్ల నీరు అందేవిధంగా చర్యలు చేపడుతామన్నారు. తమ మేనిఫెస్టోలో సాధారణ పౌరుడే ప్రధాన అంశమని ఆయన చెప్పారు. పేదరికాన్ని పేద ప్రజలే ఓడించగలరని, పేదలను బలోపేతం చేయడం ముఖ్యమని, అందుకే ప్రతి పథకంలోనూ పేదలకు పెద్దపీట వేశామన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే, అది ఓ సామాజిక ఉద్యమంగా మారాలని, ఇప్పుడు స్వచ్ఛత ఓ ఉద్యమంగా మారిందన్నారు. ఒకే లక్ష్యం, ఒకే దిశ అన్న రీతిలో ముందుకు వెళ్తున్నామన్నారు.