కేసీఆర్ వార్నింగ్ తో తన స్టైల్ మార్చిన కలెక్టర్..?

SMTV Desk 2017-08-16 11:56:56  WARANGAL, COLLECTER, AMRAPAALI, CM KCR, DRESSING STYLE

వరంగల్, ఆగస్ట్ 16 : ఆధునికంగా కనపడడానికి ఎక్కువగా ఇష్టపడే వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి నిన్న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చారు. కాగా ఇటీవల సీఎం కేసీఆర్ రాష్ట్ర అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమై అధికారులు ధరిస్తున్న దుస్తులపై మరీ ముఖ్యంగా మహిళా అధికారులు ధరిస్తున్న దుస్తుల విషయంలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. జిల్లాకు కలెక్టర్లు అయి ఉండి జీన్స్, టీషర్టులను ధరించడం వల్ల అధికారుల మీద ప్రజల్లో ఉన్న గౌరవం తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలన్ని వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి గురించేనని,ఆమె ఆధునిక పోకడను తగ్గించాలనే సీఎం వార్నింగ్ ఇచ్చారని మిగతా అధికారులంతా అభిప్రాయపడ్డారు. కాగా ఆమ్రపాలి నిన్న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిండుగా చీర కట్టుతో హాజరయ్యారు. మీడియా ముందుకు మాత్రం రావడానికి ఇష్టపడలేదు.