నిజామాబాద్ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేము....

SMTV Desk 2019-04-09 13:13:32  nijamabad formers, nominations, loksabha elections, evm, ballet papers, high court, elections symbols, high court

హైదరాబాద్: రాష్ట్రం అంతా జరిగే లోక్ సభలు ఒకెత్తు అయితే నిజామాబాద్ ఎన్నికలు మరో ఎత్తు. నిజామాబాద్ లో రైతులకు రాజకీయ నాయకులకు మధ్య రసవత్తర పోటీ జరుగుతోంది. అక్కడ ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. నిజామాబాద్ లోక్‌సభ బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపి ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.