జట్టుగా ఆటను ఆస్వాదించాలి...లేకపోతే క్రికెట్‌ ఆడలేము

SMTV Desk 2019-04-09 13:12:23  ipl 2019, rcb, virat kohli

ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోయిన ఒకే ఒక జట్టు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఈ జట్టుకి గెలుపు అందని ద్రాక్షే అయింది. ఈ ఓటమిల కారణంగా వారిపై వస్తున్న విమర్శల పై ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఇంకోలా స్పందిస్తున్నాడు. ‘జట్టు ఓటములపై వివరణ ఇవ్వడానికి ఇంకా ఏం మిగల్లేదు. ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన పనిలేదు. ఏకాగ్రత దెబ్బతింటే మ్యాచ్‌ మీద దృష్టి పెట్టడం అసాధ్యం. మ్యాచులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం. కానీ అది జరగలేదు. జట్టుకు మీరు సూచించడానికి ఇంకా ఏం లేవు. జట్టుగా ఆటను ఆస్వాదించాలి. లేకపోతే క్రికెట్‌ ఆడలేము’ అని విరాట్‌ కోహ్లీ అన్నాడు.