‘కబీర్ సింగ్’ టీజర్ ఎలా ఉందంటే ?

SMTV Desk 2019-04-09 13:07:08  Kabir singh, Bollywood

తెలుగు లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి ఎంతటిఘన విజయాన్ని అందుకుంది చెప్పనక్కర్లేదు .. అయితే ఈ మూవీ హిందీ లో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటిస్తున్నారు .. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ని ఇవాళ విడుదల చేసారు .. కట్ చేస్తే తెలుగు అర్జున్ రెడ్డి లాగే టీజర్ వచ్చింది .. షాహిద్ కపూర్ బాడీ లాంగ్వేజ్ .. టైమింగ్ అన్ని సెట్ అయ్యాయి.. షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్‌, డైలాగ్స్‌ అన్ని అర్జున్‌ రెడ్డినే పోలి వున్నాయి. మరి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి, బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.