కూకట్‌పల్లిలో రూ.23 లక్షలు స్వాధీనం

SMTV Desk 2019-04-09 13:04:47  loksabha elections, money transfer, illegal cash, kookatpally, congress party

హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా నగరంలో అక్రమ సొమ్ము విచ్చలవిడిగా నగదు చలామణి అవుతుంది. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇవాళ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిజాంపేట్‌ నుంచి మల్కాజ్‌గిరికి తరలిస్తున్న రూ. 23 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తులదిగా పోలీసులు గుర్తించారు.