ముంబై నార్త్‌ సెంట్రల్‌ నుండి బరిలోకి ప్రియాదత్‌

SMTV Desk 2019-04-09 12:56:52  loksabha elections, sanjay dutt, priya dutt, congress party, rahul gandhi, mumbhai north central constituency

ముంభై: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదు అని స్పష్టం చేసిన సంజయ్ దత్, అతని సోదరి ప్రియాదత్‌ తాజాగా ముంబై నార్త్‌ సెంట్రల్‌ లోక్‌ సభకు నామినేషన్‌ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ప్రియా దత్ తర్వాత రాహుల్ గాంధీనికలిసి పోటీకి సుముఖత వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తోన్న ప్రియా దత్‌ 2005, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందింది. 2014లో మాత్రం ప్రియా దత్‌ పై బీజేపీ అభ్యర్థి పూనమ్‌ మహాజన్‌ విజయం సాధించారు.