ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకునే ఆప్షన్....

SMTV Desk 2019-04-09 12:54:58  adhar card, adhar card link up, central government schemes, state governments schemes

ఒక వ్యక్తి శాశ్వత దృవీకరణ పత్రం ఆధార కార్డుకు సర్కార్ ఎన్ని లింకులు పెడుతుందో తెలిసిందే. అయితే మన ఆధార్ వివరాలు ఎక్కడెక్కడ ఎందుకోసం ఎవరెవరు ఉపయోగించారో మనకు తెలియదు. అయితే యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్ కార్డు వివరాలను ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ అథంటికేషన్ హిస్టరీ వివరాలు తెలుసుకోవాలి. ఈ వివరాలను మీరొక్కరే చూడొచ్చు. మరెవరూ కూడా మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే సమాచారాన్ని చూడలేరు. ఆధార్ నెంబర్ మీ ప్రమేయం లేకుండా ఎవరైనా, ఎక్కడైనా ఉపయోగించి ఉంటే మీరు అథంటికేషన్ యూజర్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయవచ్చు. యూఏడీఏఐ దృష్టికి కూడా ఈ విషయానికి తీసుకెళ్లొచ్చు. దీని కోసం 1947కు ఫోన్ చేయవచ్చు. లేదంటే help@uidai.gov.inకు మెయిల్ పంపొచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్ అథంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవడం ఎలానో చూద్దాం..

✺ యూఐడీఏఐ వెబ్‌సైట్ uidai.gov.inకు వెళ్లండి.
✺ మై ఆధార్ ట్యాబ్‌‌లోని ఆధార్ సర్వీసెస్‌కు వెళ్లండి. ఆధార్ అథంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయండి.
✺ ఆధార్ అథంటికేషన్ హిస్టరీ పేజ్‌లో మీ12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఉన్న సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి.
✺ వన్ టైమ్ పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది.
✺ తర్వాత అథంటికేషన్ టైప్ ఎంచుకోవాలి. డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్, ఓటీపీ, బయోమెట్రిక్ అండ్ ఓటీపీ, డేట్ రేంజ్ వంటి ఆప్షన్లు ఉంటాయి. వీటిని ఫిల్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయాలి. సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.✺ డిస్‌ప్లే అయ్యే పేజ్‌లో మీ ఆధార్ అథంటికేషన్ హిస్టరీ కనిపిస్తుంది. ఇందులో మీ వివరాలను ఉపయోగించిన డేట్, టైమ్ వంటివి ఉంటాయి. మీరు కేవలం గరిష్టంగా 50 వరకు రికార్డులను మాత్రమే చూడగలరు.