‘ఇస్మార్ట్ శంకర్’...‘దిమాక్ ఖరాబ్…’

SMTV Desk 2019-04-09 12:52:42  Ram pothineni, Puri jagannad, Ishmart Shankar Movie, Remuneration, nidhi agarwal, nabha natesh, charmie, dimakh kharab song

హైదరాబాద్: రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ‘దిమాక్ ఖరాబ్…’ అనే సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. వందమంది డ్యాన్సర్లతో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాట తెలంగాణ యాసలో సాగుతుంది. ఈ పాటలో నిధి అగర్వాల్ స్టిల్‌ను విడుదల చేశారు. వైబ్రెంట్ కాస్టూమ్స్‌లో ఉన్న నిధి లుక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ సాంగ్ సెట్‌ను సందర్శించి సరికొత్త స్టైల్‌లో ఉన్న రామ్ లుక్‌ను, సాంగ్ మేకింగ్‌ను ప్రశంసించారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.