వీవీప్యాట్లపై సుప్రీం కీలక నిర్ణయం

SMTV Desk 2019-04-09 11:53:08  Voter Verifiable Paper Audit Trail, vvpat, supreme court

న్యూఢిల్లీ : వీవీప్యాట్ల లెక్కింపుపై విచారణ చేపట్టిన సుప్రీం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నియోజకవర్గానికి కేవలం ఒక్క వీవీప్యాట్‌ స్లిప్‌లనే లెక్కపెడుతున్న విషయంపై అత్యున్నత న్యాయస్థానం ప్రతిపక్షాలనే సమర్థించింది. యాభై శాతం వీవీప్యాట్ల లెక్కింపు చేపట్టాలని ప్రతిపక్షాల అభ్యర్థనపై విచారించిన ధర్మాసనం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వీవీప్యాట్లలోని స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని చెప్పింది. లోక్‌ సభ నియోజకవర్గాల్లో అయితే 35 వీవీపాట్ల స్లిప్పులను లెక్కపెట్టాలని సూచించింది. ఈ విషయంపై ఈసీ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది.