స్టైలిష్ స్టార్ తో రొమాన్స్ చేయనున్న రష్మిక

SMTV Desk 2019-04-09 11:48:23  Rashmika, Rashmika Mandanna

చలన చిత్ర రంగంలో అంచలంచలుగా ఎదుగుతున్న హీరోయిన్ రష్మిక మందన్న. చలో సినిమా తో పరిచయమైన ఈ భామ క్రమ క్రమంగా ఎదుగుతూ వస్తుంది .. రీసెంట్ గా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా లో విజయ్ తో చుంబన దృశ్యాలు ప్రజలని ఆకట్టుకున్నాయి .. అయితే ఈ అందాల భామ మరో మెగా ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్,సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈసినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది.ఈ విషయాన్నిమైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తోంది. దీంతో అల్లు అర్జున్‌తో నటించబోయే సినిమాలో కూడా యాక్ట్ చేసే అవకాశం పట్టేసింది. వీటితో పాటు మహేష్ బాబు,అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్‌గా దాదాపు ఖరారైంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తూ నెంబర్ వన్ ప్లేస్‌పై కన్నేసింది.