‘మై బ్లాక్‌బస్టర్‌ కపుల్‌’

SMTV Desk 2019-04-09 11:33:07  Nagarjuna, Samantha , Naga chiatanya

‘మజిలీ’ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ సినిమా సాధించిన సక్సెస్ గురించి నాగార్జున స్పందించారు. తన కుమారుడు, కోడలు బ్లాక్‌బస్టర్‌ కపుల్ అని ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నాగ చైతన్య, సమంతలతో కలిసి సంతోషంగా దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ‘మై బ్లాక్‌బస్టర్‌ కపుల్‌’ అని పేర్కొన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సమంత అంటే నాగార్జునకు ప్రత్యేక అభిమానం వుంది. కొడుకు, కోడలితో చాలా సన్నిహితంగా మెలుగుతారాయన. సమంత కూడా షూటింగ్‌ల నుంచి ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో గడపడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ముఖ్యంగా సమంత పాత్ర చాలా బాగుందని అంటున్నారు. ఆమె అత్యంత సహజంగా ఆ పాత్రకు ప్రాణం పోశారని ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. త్వరలోనే ఆమె ‘96’ తమిళ రీమేక్‌లో నటించనున్నారు.