స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్ళిన బాలికపై అత్యాచారం..!!

SMTV Desk 2017-08-15 19:08:58  rape attemptet, chandighar, chidrens park, kidnap

చండీఘడ్, ఆగస్ట్ 15 : దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ ఓ అమ్మాయి జీవితంపై ఓ కామాంధుడు కన్నేశాడు. 8 వ తరగతి చదువుతున్న ఆ బాలిక తన స్కూల్లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లి౦ది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో పట్ట పగలే 40 ఏళ్ల వ్యక్తి చండీఘడ్, సెక్టార్ 23లోని చిల్డ్రన్స్ పార్క్ లో ఆ బాలికను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా ఈ సంఘటన పోలీస్ స్టేషన్ కి సమీపంలోనే జరగడం గమనార్హం. వెంటనే తేరుకున్న బాలిక పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ బాలికను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.