పవన్ నివాసానికి రామ్ చరణ్

SMTV Desk 2019-04-09 11:22:19  ram charan, pawan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు రెండు రోజుల క్రితం వడదెబ్బ తగిలిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా తన బాబాయ్ ని హీరో రామ్ చరణ్ కలిసి పరామర్శించారు. విజయవాడలోని పవన్ నివాసానికి రామ్ చరణ్ ఈరోజు వెళ్లాడు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఓ ట్వీట్ లో తెలిపాడు. డీహైడ్రేషన్ కు గురైన తన బాబాయ్ చాలా బలహీనంగా ఉన్నారని చెప్పాడు.

ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దని బాబాయ్ కు వైద్యులు సూచించారని, అయితే, పొలిటికల్ కమిట్ మెంట్స్, ఎన్నికల ప్రచారానికి ఇంకా తక్కువ సమయం ఉన్నందున ప్రచారంలో పాల్గొనాలనే ఆయన నిర్ణయించుకున్నారని తెలిపాడు. అనకాపల్లి, పెందుర్తిలలో ఈరోజు నిర్వహించే బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారని పేర్కొన్నాడు. ప్రజా సేవకు పాటుపడుతున్న పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని, విజయం వరించాలని ఆకాంక్షిద్దామని రామ్ చరణ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.