బైక్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం....5 టిప్స్‌

SMTV Desk 2019-04-09 11:05:41  bikes, two wheeler, motor vehicle

టూ వీలర్ కు సంబంధించినవి అన్ని రోజూ చెక్ చేసుకోవడం అంటే కాస్త కష్టమైన పనే. ఎంత బైక్ ప్రియులైన వారికి ఎప్పుడో ఒకసారి విసుగస్తుంది. బైక్ పనితీరు చాలా అంశాలపై అధారపడి ఉంటుంది. అయితే కొన్నింటితో బైక్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. కేవలం రెగ్యులర్‌ సర్వీస్‌తోనే మంచి పర్ఫార్మెన్స్‌, టాప్ స్పీడ్ వంటి వాటిని పొందలేం. అదనంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట...బరువు ఎక్కువ ఉంటే అప్పుడు బైక్ పనితీరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. బైక్ స్పీడ్ తగ్గుతుంది. అలాగే మైలేజ్ కూడా తక్కువ వస్తుంది. ఒకే రకమైన బైక్‌లో ఇద్దరు వ్యక్తులు రైసింగ్‌లో పాల్గొంటే.. తక్కువ బరువున్న రైడర్ గెలుస్తాడు. ఎక్కువ బరువును లాగడానికి బైక్ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అందుకే బైక్‌లో అనవసరంగా ఉన్న భాగాలను తీసేస్తే బైక్ పనితీరు మెరుగుపడుతుంది. స్పోక్ వీల్స్ స్థానంలో అలాయ్ వీల్స్ వాడటం వల్ల కూడా బైక్ మంచి పనితీరు కనబరుస్తుంది. సెంటర్ స్టాండ్, మెటల్ గ్రాబ్ రెయిల్స్, లెట్ గార్డ్ వంటి వివిధ పార్ట్‌లను తీసేస్తే బైక్ బరువు 5 నుంచి 6 కేజీల మేర తగ్గుతుంది. బైక్ మీద ఒక్కరే ప్రయాణిస్తుంటే రియర్ ఫుట్ పెగ్స్ వద్ద ఉన్న ఫ్రేమ్ కూడా తీసేయవచ్చు. రెండవది....బైక్ పనితీరులో ఎయిర్ ‌ఫిల్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఇంజిన్‌కు ఎక్కువ గాలి లభ్యమై, అది అదనపు ఇంధనాన్ని వినియోగించుకొని ఎక్కువ పవర్‌ను విడుదల చేస్తుంది. అందువల్ల ఇకపై ఎయిర్ ఫిల్టర్లపై కన్నేసి ఉంచండి. మూడవది.....కార్బురేటర్ బైక్స్‌ను ట్యూన్ చేయడం చాలా సులభం. బైక్ పర్ఫెక్ట్‌గా ట్యూన్ చేస్తే మంచి పనితీరు నమోదవుతుంది. ప్రి-ట్యూన్‌డ్ పర్ఫార్మెన్స్ కార్బురేటర్లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్, ఎక్స్‌హాస్ట్ వ్యవస్థను పర్ఫెక్ట్‌గా కంబైన్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఫ్యూయెల్ ఇన్‌జెక్షన్‌ బైక్స్ ట్యూనింగ్‌లో ఈసీయూ మ్యాపింగ్ విధానాన్ని ఉపయోగిస్తారు. నాలుగొవది....పర్ఫార్మెన్స్ ఎక్స్‌‌హాస్ట్‌ల వల్ల ఇంజిన్ సులభంగా గాలిని పీల్చుకుంటుంది. అదేసమయంలో గ్యాస్‌‌ను వేగంగా బయటకు పంపిస్తుంది. ఇంజిన్‌కు ఎక్కువ గాలి లభ్యమైతే అధిక ఇంధనాన్ని మండిస్తుంది. అందువల్ల బైక్ పనితీరు మెరుగుపడుతుంది. ఐదవది....గేరింగ్‌లో మార్పుల వల్ల కూడా బైక్ వేగంగా వెళ్తుంది. ఫ్రంట్, రియర్ స్ప్రాకెట్స్ కాంబినేషన్ కరెక్ట్‌గా కుదిరితే బెస్ట్ యాసిలరేషన్, టాప్ స్పీడ్ పొందొచ్చు. పెద్ద రియర్ స్ప్రాకెట్ లేదా చిన్న ఫ్రంట్ స్ప్రాకెట్ వల్ల ఎక్కువ యాసిలరేషన్ సాధ్యమౌతుంది. అలాగే చైన్ టైట్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే బైక్ టైర్లలో గాలి సరిపడేంత ఉంచుకోండి.