మేక్ ఇన్ ఇండియా పేరిట మోదీ జాదు...

SMTV Desk 2017-06-02 15:58:52  rahul gandhi, sangareddy, prajagarjana, target modi

సంగారెడ్డి, జూన్ 2:మేక్ ఇన్ ఇండియా పేరిట మోదీ ప్రజల్ని జాదు చేశారని అఖిల భారత కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయన పాల్గోని ప్రసంగించారు.ఈ సందర్భంగా కార్యకర్తలు బహుకరించిన కత్తి , గద ను పైకేత్తి జనానికి అభివాదం చేశారు. ఏ వస్తువు చూసినా, సెల్ ఫోన్ తీసి చూసినా వాటిపై మేడిన్ చైనా అనేది స్పష్టంగా ఉండడం భారతీయులందరికి బాధ కలిగించేదేనని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే మేడిన్ ఇండియా, మేడిన్ తెలంగా ణా కనిపించేలా చేస్తామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి పార్టీ అని, పార్టీ నేతలు, కార్యకర్తలు జనంలోకి వెళ్ళాలని, రైతులు, యువతతో మమేకం కావాలని సూచించారు. యువతకు ఉపాధి కల్పించడం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని చెప్పారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కంటే మోదీ హయంలోనే నిరుద్యోగిత శాతం పెరిగిందని చెప్పారు. తాము మాటలు చెప్పే వారం కాదని, చేతల్లో చేసి చూపిస్తామని ...యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రైతు ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కార్యదర్శులు రామచంద్ర కుంతియా, డాక్టర్ చిన్నారెడ్డి, వి.హన్మంత్ రావు, టిపిసిసి చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సిఎల్ పి అధినేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎంఎల్ఎలు జీవన్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జె.గీతారెడ్డి, డికె అరుణ, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, ఎంఎల్ సి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపిలు రాపోలు ఆనంద భాస్కర్, నంది ఎల్లయ్య, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.