ఈసీ అధికారులకు వేతనాలు పెంపు...రోజుకి రూ.5 వేలు

SMTV Desk 2019-04-08 21:14:27  election commission of india, election officers salary increases

కేంద్ర ఎన్నికల సంఘం మరో సంచలన ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల అధికారులకు వేతనాలు పెంచుతున్నట్లు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సిబ్బంది స్థాయిలను బట్టి ఈసీ వేతనాలు పెంచింది. సెక్టార్ అధికారులకు రోజుకు రూ.5 వేలు, మాస్టర్ ట్రైనర్లకు రూ.2 వేలు, ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లు, రిసెప్షన్ సూపర్ వైజర్లకు రోజుకు రూ.350 చొప్పున, క్లాస్-4 ఉద్యోగులకు రూ. 150 గౌరవవేతనం అందజేయనున్నారు. అలాగే మధ్యాహ్న భోజనానికి రూ.150 చెల్లించనున్నారు. వీడియో చిత్రీకరణ, అకౌంటింగ్, మానిటరింగ్, కంట్రోల్ రూం, కాల్‌సెంటర్, ఫ్లైయింగ్ స్కాడ్, స్టాటిక్స్ సిబ్బందికి స్థాయిని బట్టి వేతనం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు సహకరిస్తూ.. ఓటి శాతం పెంచేలా చేయటం, అందుకు తగ్గట్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్‌గా ఏ సమస్యలను పరిశీలిస్తూ.. ఓటర్లతో సక్రమంగా ఓట్లు వేయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి నిర్ణీత గడువు వరకూ ఎన్నికల సిబ్బంది ఎటువంటి పొరపాట్లు జరగకుండా వ్యవహరించటం వంటి కీలక అంశాలను దృష్టిని కేంద్రీకరించాలి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సిబ్బందికి జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.