హెలికాప్టర్‌ను ఢీకొన్న వ్యాన్...ఒకరు మృతి

SMTV Desk 2019-04-08 21:04:00  america, florida, helicaptor hits van in road, Helicopter crashes on road

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో హెలికాప్టర్‌ను ఓ వ్యాన్ ఢీకొంది. ఈ సంఘటనలో వ్యాన్ డ్రైవర్ అక్కడిక్కడే మరణించాడు. ఈ విచిత్ర సంఘటన వివరాలిలా ఉన్నాయి. తాజాగా ఫ్లోరిడాలో ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న చిన్నపాటి హెలికాప్టర్లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో పైలట్ దాన్ని పామ్ నది సమీపంలోని జాతీయ రహదారిపై దించాడు. హెలికాప్టర్ రోడ్డుపై నెమ్మదిగా వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ ట్రక్కు దాన్ని ఢీకొంది. దాన్ని రెక్కలు వాహనంలోకి దూసుకెళ్లడంతో ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో హెలికాప్టర్ రెక్కలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. పక్కనే పవర్ ప్లాంట్‌ ఉండటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హెలికాప్టర్‌లోని ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు.