భీమవరంలో పవన్ ఫ్యాన్స్ VS ప్రభాస్ ఫ్యాన్స్

SMTV Desk 2019-04-08 20:46:57  Prabhas, PAwan Kalyan

భీమవరంలో అగ్గి రాజుకుంది. అక్కడ ఒక రకంగా యుద్ధమే జరుగుతుంది. పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ భీమవరంలో తలపడుతున్నారు. పవన్ ను ఓడించడానికి ప్రభాస్ ఫ్యాన్స్ కంకణం కట్టుకుని పనిచేస్తున్నట్టు సమాచారం. అంతేగాక హైదెరాబాదలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భీమవరం బాట పట్టినట్టు సమాచారం.

అయితే, కొందరు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ కు ప్రభాస్ మద్దతు ప్రకటించారంటూ ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ, ప్రభాస్ ఎక్కడా కూడా అటువంటి ప్రకటన చెయ్యలేదు. ఇలా ప్రభాస్ పేరుతో తప్పుడు ప్రచారం చెయ్యడం ఆయన అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. జనసేన అభిమానులు చేస్తున్న ప్రచారాన్ని వారు ఖండించారు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంటా పవన్ కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉందని చెబుతున్నారు.