నిరుద్యోగులకు శుభవార్త .. టీసీఐఎల్‌లో పోస్టులు, జీతం రూ.28వేల పైనే

SMTV Desk 2019-04-08 20:38:32  Jobs,

న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇడియా లిమిటెడ్ టెలికామ్(టీసీఐఎల్) సంస్థ ఐటీ, సివిల్ విభాగాల్లో అసిస్టెంట్, అసిస్టెంట్& జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పోస్టుల వారీగా ఇందుకు విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఏప్రిల్ 18లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు : అసిస్టెంట్ 06
జూనియర్ ఇంజినీర్ (టెలికామ్/ఐటీ) 8

అసిస్టెంట్ ఇంజినీర్ (టెలికామ్/ఐటీ) 2
జూనియర్ ఇంజినీర్ (సివిల్) 10
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 02

మొత్తం పోస్టులు 28
విద్యార్హత : పోస్టులను బట్టి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : Telecommunications Consultants India Limited పేరిట రూ.1000 డిడి తీయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం : వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి.. డిడి జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా
పరీక్ష విధానం : రాతపరీక్షలో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లష్, టెక్నికల్ అంశాల మీద ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు కాపీల పంపేందుకు చివరితేది : 22-04-2019
అడ్రస్ : The group General Manager(HRD), Telecommunications Consultants India Ltd, TCIL Bhawan, Greater Kailash -1, New Delhi G 110048