13 గంటల్లో 10 మిలియన్ వ్యూస్.. “మహర్షి” ఆల్ టైం రికార్డు.!

SMTV Desk 2019-04-08 20:36:52  Maharshi, Maharshi teaser,

సూపర్ స్టార్ మహేష్ బాబు తాను తీస్తున్న “మహర్షి” సినిమా ఇంకా విడుదల కాకముందే టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్నాడు.సాధారణంగా మహేష్ బాక్సాఫీస్ స్టామినా ఏ పాటిదో అందరికీ తెలుసు.ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మహేష్ తన దూకుడు చూపిస్తున్నారు.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి చిత్ర టీజర్ ఈ రోజు ఉగాది పర్వదినం సందర్భంగా విడుదలైంది.ఇక మహేష్ అభిమానులు ఊరుకుంటారా ఎప్పటి నుంచో కాచుకు చూసే సింహానికి ఆహారం దొరికినట్టుగా యూట్యూబ్ పై విరుచుకుపడ్డారు.దీనితో కేవలం 13 గంటల్లోనే 10 మిలియన్(కోటి)రియల్ టైం వ్యూస్ ను సంపాదించిన మొట్టమొదటి టాలీవుడ్ టీజర్ గా చరిత్ర సృష్టించిందని ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత అయిన దిల్ రాజు తెలిపారు.



ఇలా 13 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ ను రాబట్టిన మొట్టమొదటి టీజర్ గా టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డును సృష్టించింది.మహేష్ ఇప్పుడే ఇన్ని రికార్డులు కొల్లగొడితే ఇక సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతారో చూడాలి.ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా వచ్చే మే నెల 9న భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.