ఒకవేళ హంగ్ వస్తే ... నేను ఎవరికి మద్దతు ఇవ్వను .. ఒంటరిగానే ఉంటా...

SMTV Desk 2019-04-08 20:33:02  Janasena, Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మంచి హీట్ ని పుట్టిస్తున్నాయి.దానికి కారణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.2014లో పార్టీ ని స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు రాజ్యాధికారం దగ్గరకి వచ్చారు.ముందు నుంచి పవన్ కు అపారమైన జనాదరణ ఉండడంతో పాటు గడిచిన ఐదేళ్లలో తనదైన పాత్రను కనబర్చారు.అయితే గత కొన్ని రోజులు నుంచి మాత్రం జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి బి టీమ్ గా పనిచేస్తుందని చాలా రకాల ఆరోపణలు కూడా వచ్చాయి.

కానీ వాటిని పవన్ మాత్రం చాలా సింపుల్ గానే ఖండించి పారేసారు.అలాగే పలు రకాల చానెళ్లకు కూడా పవన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.తాజాగా బీబీసీ తెలుగు ఛానెల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకవేళ హంగ్ ఏర్పడే పరిస్థితి వస్తే కనుక తాను ఏ పార్టీకి మద్దతు ఇస్తారని అడగగా “జనసేన పార్టీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.ఒకవేళ హంగ్ వచ్చే పరిస్దితుల్లో.. జనసేన ఒంటరిగా ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళుతుంది కానీ టీడీపీ & వైసీపీ పార్టీల్లో దేనికి మద్దతు ఇవ్వదు…హంగ్ వస్తే కనుక టీడీపీ-వైసీపీ పార్టీలు రెండు కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి”నిగ్గదీసి తేల్చేసారు,తాను ఎవరికీ మద్దతు ఇవ్వనని ఒంటరిగానే ఉంటానని తెలిపారు.