చంద్ర‌బాబులా ముందొక‌మాట‌… వెన‌కొక‌మాట మాట్లాడ‌టం వైఎస్ జ‌గ‌న్‌కు చేత కాదు

SMTV Desk 2019-04-04 18:40:09  YS Jagan, Chandrababu, Mudragada,

ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలో గ‌డియ‌కో రీతిన మారుతున్నాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం రాజ‌కీయ పార్టీల అధినేత‌లు తీసుకుంటున్న నిర్ణ‌యాలు, నిమిషానికొక‌టి చొప్పున విడుద‌ల‌వుతున్న సర్వేలేన‌ని రాజ‌కీయాల‌పై పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న ఉన్న వారు అంటున్నారు. ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న పార్టీ ఏద‌య్యా..? అని రాష్ట్రంలోని ఏ ఒక్క‌రిని ప్ర‌శ్నించినా అందుకు వారిచ్చే స‌మాధానం ఏమిటో తెలుసా..? వైసీపీనే క‌దా అని.

వైసీపీనే క‌దా..! అని వారు అన‌డంలో ఎటువంటి నిస్సందేహం లేదు. ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ నుంచి వైసీపీలోకి చేరిక‌ల‌ను, అంత‌కు ముందు ఇత‌ర పార్టీల నుంచి వైసీపీలో జాయినింగ్స్‌ను చూసిన ఏ ఒక్క‌రైనా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌క త‌ప్ప‌దు. అంత మంది ఒక్క‌సారిగా వైసీపీలో చేర‌డానికి కార‌ణం ఇటీవ‌ల విడుద‌ల‌వుతున్న స‌ర్వేలేన‌ని ప్ర‌త్యేకంగా చెప్పాలా..? విడులైన స‌ర్వేలు గ‌తంలో వారి స‌త్తాను ప్ర‌ద‌ర్శించిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ స‌ర్వేల‌పై న‌మ్మ‌కం పెరిగి సినీ ఇండస్ట్రీ ప్ర‌ముఖులు, ఇత‌ర పార్టీల్లోని నేత‌లు వైసీపీలో చేరార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌.

అలా వైసీపీలో చేరిన‌వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే, కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కూడా ఇప్పుడు ఆ దిశ‌గా నిర్ణ‌యం తీసుకోనున్నార‌ట‌. అదేనండీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేరేందుకు ముద్ర‌గ‌డ సిద్ధ‌మైపోయార‌ట‌. ఆ అనంత‌రం జ‌గ‌న్‌ను సీఎంను చేసేందుకు వైసీపీ త‌రుపున త‌న సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌తో క‌లిసి ప్ర‌చారం కొన‌సాగించేందుకు చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట అంటూ ఓ సోష‌ల్ మీడియా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఆ సోష‌ల్ మీడియా ప్ర‌చురించిన వివ‌రాలిలా ఉన్నాయి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డంలో పూర్తి స్థాయిలో విఫ‌ల‌మైంద‌ని, రిజ‌ర్వేష‌న్‌ల‌ను క‌ల్పించ‌క‌పోగా, కాపుల అభివృద్ధికి మంజూరు చేస్తానన్న నిధుల‌ను సైతం చంద్ర‌బాబు స‌ర్కార్ విడుద‌ల చేయ‌లేద‌ని, ఇలా గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా పూర్తి స్థాయిలో కాపుల అభివృద్ధి కుంటుప‌డింద‌ని, ఒక్క చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీల‌ను న‌మ్మి తాము మోస‌పోయామ‌ని కాపు సంఘాల నేత‌లు గ్ర‌హించార‌ని ఆ క‌థ‌నం పేర్కొంది.

ఇక కాపుల అభివృద్ధికి, సంక్షేమానికి అన్ని విధాలా పాటుప‌డేది ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న ఆ సామాజిక సంఘాల నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని, ఆ క్ర‌మంలో ఏపీలో అధికారంలోకి రాబోయేది వైసీపీనే కాబ‌ట్టి, ఆ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపి వైఎస్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తే కాపుల అభివృద్దికి స‌హ‌క‌రిస్తార‌న్న నమ్మ‌కాన్ని వారు వ్య‌క్త‌ప‌రిచారు. అదే స‌మ‌యంలో నాడు వైఎస్ జ‌గ‌న్ కాపులకు ఇచ్చిన హామీల‌ను వారు గుర్తుకు చేసుకున్న‌ట్టు స‌మాచారం.

చంద్ర‌బాబులా ముందొక‌మాట‌… వెన‌కొక‌మాట మాట్లాడ‌టం వైఎస్ జ‌గ‌న్‌కు చేత కాదన్న వాస్త‌వం ప్ర‌త్యేక హోదా విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని, కాపుల‌కు ఇచ్చిన‌హామీల‌ప‌ట్ల కూడా వైఎస్ జ‌గ‌న్ నిబ‌ద్ధ‌త క‌లిగి ఉంటాడ‌న్న న‌మ్మ‌కాన్ని కాపు సంఘాల నేత‌లు వ్య‌క్త‌ప‌రిచిన‌ట్టు సమాచారం. ఇలా అన్ని విధాల వైఎస్ జ‌గ‌న్ మాత్ర‌మే కాపుల‌కు న్యాయం చేయ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కాన్ని వారు పూర్తిస్థాయిలో వ్య‌క్త‌ప‌రిచారు. ఇలా కాపు సామాజిక‌వ‌ర్గం హ‌క్కుల ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీకి స‌పోర్టు చేస్తూ ప్ర‌చారం చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రిపారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆ పార్టీ శ్రేణులు స్పందిస్తూ ఇక వైఎస్ జ‌గ‌న్ గెలుపును ఆపేవారెవ‌రూ లేరంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్‌లు పెడుతున్నారు.