మీడియా తప్పుడు రాతలు రాస్తుంది!

SMTV Desk 2019-04-04 18:36:13  shruti hasan, kamal hasan, Michael Corsale

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమై తెలుగు, తమిళం భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్. అయితే ఈ హీరొయిన్ లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సలేతో ప్రేమలో ఉన్నట్లుగా అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇద్దరు కలిసి తిరగడంతో వారి పెళ్లి ఖాయమని అన్నారు. అయితే శృతిహాసన్ ఇప్పుడు పెళ్లి విషయం ఎత్తితే మాత్రం వింత వ్యాఖ్యలు చేస్తోంది. డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకోవాలా? అని ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... “ మైఖేల్, నాకు మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంది. దాన్ని అపార్థం చేసుకొని పెళ్లి వార్తలు పుట్టిస్తున్నారు. చాలా మంది మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామంటూ కథనాలు అల్లుతున్నారు. నేను పెళ్లి చేసుకోబోతున్నానంటూ మీడియా వారు తప్పుడు వార్తలు రాస్తున్నారు”అని శృతిహాసన్ పేర్కొంది. చిత్ర పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ భామ ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేయడం విశేషం.