ఇండియాలో టాప్ లో ఫ్లిప్‌కార్ట్

SMTV Desk 2019-04-04 18:32:17  Flipkart, Amazon, Oyo top workplaces, india, Flipkart top executives meet fair trade regulator

న్యూఢిల్లీ : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఓ రికార్డు సృష్టించింది. వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ భారత్‌లో అత్యంతగా ఇష్టపడే కార్యాలయంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈమేరకు వృత్తి నిపుణుల సోషల్ మీడియా నెట్‌వర్క్ ‘లింక్డ్‌ఇన్’ ఈ సర్వే నివేదికను విడుదల చేసింది. ఇక రెండు మూడు స్థానాల్లో మరో ఇకామర్స్ సంస్థ అమెజాన్, ఆతిథ్య సంస్థ ఓయో ఉన్నాయి. లింక్డ్‌ఇన్ నాలుగో ఎడిషన్ ఇండియా ‘2019 టాప్ కంపెనీస్’ జాబితాలో 10 స్థానాల్లో ఇంటర్నెట్ కంపెనీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఏడో ర్యాంక్‌ను సాధించగా, ఇంటర్నెట్, కన్జూమర్ సేవల కంపెనీలు స్విగ్గీ, జొమాటో సంస్థలు ఆరు, ఎనిమిది స్థానాలను దక్కించుకున్నాయి. ఉబెర్ ఐదు, వన్97 కమ్యూనికేషన్ నాలుగు, రిలయన్స్ ఇండస్ట్రీస్ పదో స్థానం పొందాయి.