రెండు చోట్ల పోటీ ఎందుకు?

SMTV Desk 2019-04-04 18:26:15  Union minister Smriti Irani, Smriti Irani, bjp, congress party

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు రాహుల్ గాంధీఫై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ అమేథీ ప్రజలను అవమానించారని ఆరోపించారు. అమేథీ ప్రజల మద్దతుతో రాహుల్‌ గాంధీ 15 సంవత్సరాలపాటు అధికారమనుభవించారని గుర్తు చేశారామె. ఇప్పుడు మరొక నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారని. ఇది అమేథీ ప్రజలను అవమానపరచడమేనని విమర్శించారు. అమేథీ ప్రజలు దీనిని సహించబోరని ఇక్కడి ప్రజలపై నమ్మకం ఉంటే రెండు చోట్ల పోటీ చేయడం ఎందుకని ప్రశ్నించారు.